కాల్పులకు దారితీసిన వాగ్వాదం
వాషింగ్టన్ (యూఎస్), జూలై 21: అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై ఓ దుండ గుడు కాల్పులు జరిపాడు. కారు ప్రమాదంపై ఇద్దరి మధ్య జరిగిన వివాదమే ఇందు కు కారణమని తెలుస్తోంది. ఇండియానా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియో వివరాల ప్రకారం.. యూపీ ఆగ్రాకు చెందిన గావిన్ దసౌర్ (29) కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. మెక్సికోకు చెందిన యువ తిని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సరదాగా బయటకు వెళుతుండగా కారు ప్రమాదం జరిగింది. వెంటనే దసౌర్ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి కిందకు దిగాడు వెనుక వాహనంలో ఉన్న డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్ తన దగ్గర ఉన్న తుపాకీతో దసౌర్ మెడపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దసౌర్ను అతడి భార్య ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నింది తుడి అదుపులోకి తీసుకున్నారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.