- పర్యటకంలో సరికొత్త అభిరుచి
- యూఎస్, బ్రిటన్ కాదని వేరే దేశాల్లో పర్యటన
- కజకిస్థాన్, అజర్‌బైజాన్‌పై భారతీయుల మక్కువ
- నేపాల్, భూటాన్‌పైనా పెరుగుతున్న ఆసక్తి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కొవిడ్ తర్వా త దేశంలో చాలా మంది ప్రయాణాలు చేసే ందుకు ఇష్టపడుతున్నారు. దేశంలోనే కాకుం డా విదేశీ పర్యటనలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది విదేశీ ప్రయాణాలకు భారతీయులు నెలకు రూ.12 వేల కోట్లు వెచ్చించినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, భారతీయులు ఏయే డెస్టినేషన్లకు వెళ్లాలనుకుంటున్నారో తెలిస్తే ఆ జాబితా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
మేక్ మై ట్రిప్ ట్రావెల్ కంపెనీ 2023 జూన్ నుంచి 2024 మే వరకు భారతీయులు ఆసక్తి కనబరిచిన టాప్ 10 దేశాలను హైలైట్ చేస్తూ భారతీయుల పర్యటనలపై నివేదికను విడుదల చేసింది. సాధారణంగా ఎక్కువ మంది అమెరికా లేదా యూకే వెళ్లేందుకు ఇష్టపడుతారని అనుకుంటాం. కానీ, ఈ నివేదికలో మాత్రం కజకిస్థాన్, అజర్‌బైజాన్, భూటాన్ వంటి దేశాలపై మక్కువ చూపిస్తున్నారు. భారతీయులు వెళ్లేందుకు ఇష్టపడుతున్న దేశాల్లో కజకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది.
ఎందుకీ దేశాలకు ప్రాధాన్యం?
కజకిస్థాన్
కజకిస్థాన్‌లో టూరిజం కమిటీ చైర్మన్ దస్తాన్ రిస్పెకోవ్ 2022లో భారతీయ పౌరుల కోసం 14 రోజుల వీసా రహిత పర్యటకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఆ దేశానికి భారతీయుల తాకిడి పెరిగింది. 2023లో 28 వేల మంది కజకిస్థాన్‌లో పర్యటించారు. మేక్‌మైట్రిప్ నివేదిక ప్రకారం.. కజకిస్థాన్‌కు ప్రజాదరణ 491 శాతం పెరిగింది. వీసా రహిత సేవలే ఉందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
అజర్‌బైజాన్
అజర్‌బైజాన్‌లో పర్యటకానికి సంబంధించి సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది. తక్కువఖర్చుతో ఈ దేశాన్ని సందర్శించవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1.4 లక్షల మంది భారతీయు లు ఈ దేశంలో పర్యటించారు. గతేడాదితో పోలిస్తే 2.7 రెట్లు అధికం. అజర్‌బైజాన్ పర్యటనపై గతేడాదితో పోలిస్తే 404 శాతం మంది ఆసక్తి కనబరిచినట్లు మేక్‌మై ట్రిప్ వెల్లడించింది.
భారతీయులు పర్యటించేందుకు ఇష్టపడుతున్న టాప్ 10 దేశాలు ఇవే..
1. కజకిస్థాన్, 2. అజర్‌బైజాన్, 3. భూటాన్, 4.హాంగ్‌కాంగ్, 5. శ్రీలంక, 6. జపాన్, 7. మలేసియా, 8. నేపాల్, 9. రష్యా, 10. సౌదీ అరేబియా