ఇండియా తీరు.. అభిమానుల బేజారు
విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: ఒలింపిక్స్.. ఒలింపిక్స్.. ఒలింపిక్స్.. మన భారత్ ఈసారి విశ్వవేదిక మీద సత్తా చాటుతుందని భావించిన ప్రతిసారి అభిమానులకు నిరాశే ఎదురవుతుంది. హే.. వచ్చే సారికి మనోళ్లు సాధిస్తారులే అని కంటున్న కలలు కల్లలే అవుతున్నాయి. ఈ సారి కూడా మన అథ్లెట్లు స్వర్ణం లేకుండానే తిరిగొచ్చారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం సాధించి పరువు దక్కించాడు. లేకుంటే మరీ అధ్వాన్నంగా ఉండేది పరిస్థితి.
ఏళ్లుగా ఇదే తీరు..
ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నా ఇదే తీరుతో అభిమానులను నిరాశకు గురి చేస్తూనే ఉంది. 1900 సం వత్సరం నుంచి పాల్గొంటూ వస్తున్నా కానీ మనం ఇంకా డబుల్ డిజిట్ అందుకునేందుకే నానా అవస్థలు పడుతున్నాం. అప్పుడు వలస పాలనలో ఉన్నాం కదా అని అనుకుంటే స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్స రాలు దాటిపోతున్నా కానీ పతకాల కో సం మన ఎదురుచూపులు తప్ప డం లే దు. ఇప్పటి వరకు మన భారత జట్టు ఒలింపిక్స్‌లో 10 స్వర్ణాలు, 10 రజతాలు, 21 కాంస్యాలు గెలుచుకుంది. అం టే మ నం ఇన్ని సంవత్సరాల నుంచి పా ల్గొం టూ వస్తున్నా కానీ మన అథ్లెట్లు సా ధించిన పతకాల సంఖ్య అర్ధ సెంచరీ కూ డా దాటలేదంటేనే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
రికార్డులివే..
భారతీయ ఒలింపిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించిన అథ్లెట్ల జాబితాను ఒక్కసారి చూసుకుంటే
- స్వాతంత్య్రం పొందిన తర్వాత మొదటి వ్యక్తిగత పతకం అందుకున్న వ్యక్తిగా రెజ్లర్ జాదవ్
- వరుస ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకాలు అందుకున్న తొలి అథ్లెట్‌గా సుశీల్ కుమార్
- ఒకే ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు గెలిచిన వ్యక్తిగా (స్వతంత్య్రం తర్వాత) మనూ బాకర్
- మొదటి మహిళా మెడలిస్ట్‌గా కరణం మల్లీశ్వరి
- రెండు పతకాలు సాధించిన మొదటి మహిళగా సింధు
- గోల్డ్ మెడల్ సాధించిన జట్టుగా హాకీ టీం
- మొదటి వ్యక్తిగత స్వర్ణం సాధించిన వ్యక్తిగా అభినవ్ బింద్రా నిలిచారు.