భారత్ లో వేగంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్ ప్రక్రియను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు, (UNGA) డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. భారత్ లో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరించడంతో రైతులు, బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధంలేని వారు సైతం తమ వ్యాపార లావాదేవీలను ఫోన్లతోనే జరపగలుగుతున్నారన్నారు.6 ఏళ్ల లో 80 కోట్ల భారత పౌరులు డిజిటల్ అక్షరాస్యతతో పేదరికం నుంచి బయటకు రావడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శమన్నారు.