- కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్
- మాజీ క్రికెటర్ అమర్‌నాథ్‌పై పుస్తకం
- ఫియర్‌లెస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన జైశంకర్
- పాక్‌పై భారత వైఖరిని క్రికెట్‌తో పోల్చిన మంత్రి
న్యూఢిల్లీ, నవంబర్ 29: దాయాది పాకిస్థాన్‌తో భారత్ వ్యవహరిస్తున్న తీరును క్రికెట్‌తో పోల్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. 1960-89 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ జ్ఞాపకాలతో కూడిన‘ ఫియర్‌లెస్’ పుస్తకావిష్కరణకు కేంద్రమంత్రి హాజరై మాట్లాడారు.
పాక్ విషయంలో మారిన భారత్ వైఖరిని ఆయన క్రికెట్‌తో పోల్చారు. క్రికెట్ లాగానే భారత విదేశాంగ విధానం కూడా ఉందని ఆయన అద్న్నరు. క్రికెట్ చరిత్రలోనే 1983 కీలక మలు పు అని, ప్రపంచ్ కప్‌ను ఇండియా గెలవడంతో భారత్‌లో క్రికెట్ స్వరూపమే మారిపోయిందని అన్నారు.
క్రికెట్ లో వచ్చే మార్పులతో విదేశాంగ విధానాన్ని పోల్చడానికి తాను ఎప్పడూ ఇష్టపడతానని పేర్కొన్నారు. చాలామంది చెస్‌తో ఫారిన్ పాలసీన పోల్చుతారని, కానీ ఆ రెండింటి మధ్య ఎలాంటి పోలిక లేదన్నారు. క్రికెట్‌లాగానే విదేశాంగ విధానం ఉంటుందని, దీనిలో చాలామంది ఆటగాళ్లు ఉంటారని, అక్కడ కూడా ఆడే పరిస్థితులు ఉంటాయన్నారు.
విదేశాంగ విధానంలో కూడా సొంత మైదానంలో ఆడడం విదేశీ గడ్డపై ఆడడంలో తేడాలుంటాయని తెలిపారు. కొన్నిసార్లు అంపైర్ల నిర్ణయాలపై క్రికెట్‌లో పరిస్థితులు ఆధారపడి ఉంటాయని, క్రికెట్‌లో కూడా అనేక ఫార్మట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆట ఆడేటప్పుడు మానసికంగా సిద్ధంగా ఉండడం, ఇతరులకు విభిన్నంగా ఆలోచిచండం, ఎదుటి ఆటగాడి ఆలోచనలు పసిగట్టడం వంటివి ఉంటాయని, ఆటలో ప్రతీసారి గెలవాలని ఆటగాళ్లు కోరుకుంటారని తెలిపారు. అందుకే ఎవరికీ అర్థం కాని విదేశాంగ విధాన విషయాలను ప్రజలకు వివరించడంలో క్రికెటర్లతో పోలికలు ఉంటాయన్నారు.
ప్రపంచం ఎలాంటి భారత్‌తో డీల్ చేయాలనుకుంటున్నదో అలాంటి స్థితిలో ప్రస్తుతం భారత్ ఉందని చెప్పారు. ప్రపంచదేశాలతో వ్యవహరించేటప్పుడు భారత్ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ, ఇతరుల శక్తిసామర్థ్యాలను పరీక్షిస్తోందన్నారు.
1982-83లో పాక్‌లో మన జట్టు పర్యటించినపుడు మన ఆటగాళ్లు సంప్రదాయ ఆటతీరు నుంచి బయటకు వచ్చి దూకుడు విధానాని ఎంచుకుని మెరుగ్గా ఆడారని చెప్పారు. ఇప్పుడు పాక్‌తో మనదేశ విదేశాంగ విధానంలో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదని ఆయన అన్నారు.