జెనీవా: అప్పుడే కొత్తగా చేరిన ఉద్యోగం.. అదీ.. ప్రతిష్ఠాత్మకమైన విదేశాంగ శాఖలో చేరిన యువకుడు ఎవరైనా సరే.. నాన్నకు ప్రేమతో.. ఒక బహుమతి తీసుకెళ్లి నాన్నని సర్ప్రైజ్ చెయ్యాలి.. అనుకుంటారు.. కానీ ప్రతిష్ఠాత్మకమైన విదేశాంగ శాఖలో చేరిన జై శంకర్ తన అనుభవాలను ఎన్నారైలతో పంచుకున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్.. పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్..జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి.."ది కాందహార్ హైజాక్" సిరీస్ గురించి మాట్లాడుతూ గతంలో తన జీవితంలో జరిగిన షాకింగ్ విషయాన్ని తెలిపారు. 1984లో జరిగిన ఒక హైజాక్ ఉదంతం గురించి ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1984లో జరిగిన ఒక హైజాక్ సమయంలో తాను అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరానన్నారు.
1984లో జరిగిన హైజాక్ ఘటన డీల్ చెయ్యాల్సిన బృందం తాలూకు చీఫ్ నెగోషియేటర్ నేతృత్వంలో అధికారిగా పని చేస్తున్నానని చెప్పారు. దీంతో తాను ఇంటికి రావడం కుదరదని మాఅమ్మకు ఫోన్ చేస చెప్పాను, అయితే ఆతర్వాత తెలిసింది ఏమిటంటే..హైజాక్ కు గురైన విమానంలోనే మా నాన్న ఉన్నారని తెలిసిందనీ, కాకపోతే అదృష్టవశాత్తూ ఉగ్రవాదులకు అతడు ఎవరో తెలియకపోవడంతో ఇండియాకు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లైంది. అంతే కాదు విమానంలో ఉన్న వారికి ఏమీ కాలేదని తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక వైవు హైజాక్‌కు సంబంధించి వ్యవహారాన్ని చూస్తోన్న బృందంలో పని చేస్తూ.. హైజాక్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కుటుంబ సభ్యుల్లోనూ తాను ఉన్నానని చెప్పారు. ఇంతకాలం ఎవరికీ పెద్దగా తెలియని ఈ విషయాన్ని చెప్పి మంత్రి అందరినీ ఆశ్చర్యపరిచారు.
1984లో.. అసలు ఏమి జరిగింది అంటే..
1984 ఆగస్టు 24న భారత్ కు చెందిన విమానం ఐసీ 421 ధిల్లీ నుండి టేకాఫ్ అయి చండీగఢ్ లో ల్యాండ్ కాగానే ఏడుగురు హైజాకర్లు కాక్ పిట్ లోకి ప్రవేశించారు. జైర్నెల్ సింగ్ బింద్రన్ వాలేతో పాటు ఇతరులను విడుదల చేయాలని విమానాన్ని హైజాక్ చేసిన ఆల్ ఇండియా సిఖ్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. 36 గంటల పాటు ఆ విమానాన్ని హైజాకర్లు నాలుగు విమానాశ్రయాల మధ్య తిప్పారు. అలా ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చివరకు అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారని విరించారు. అటు విద్యుక్త ధర్మం.. ఇటు దుండగుల చెరలో నాన్న.. శంకరుడి కంఠంలో గరళంలాంటి తన మనస్థితి ఈ నేపథ్యంలో అనుభవించిన సంఘర్షణ పరిస్థితిని ఎదుర్కొన్న మంత్రి కథనాన్ని ఎన్నారైలు ఆసక్తిగా ఆలకించారు.