calender_icon.png 25 March, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో దుండగుడి కాల్పులు.. భారత్ కు చెందిన తండ్రి, కూతురు మృతి

23-03-2025 05:39:02 PM

వర్జీనియా,(విజయక్రాంతి): అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత్ కు చెందిన తండ్రి, కుమార్తె మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియా రాష్ట్రంలోని ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన తండ్రి ప్రదీప్ పటేల్(56) అతని కుమార్తె ఊర్మి(24) మరణించారు.   కాల్పులకు పాల్పడిని వ్యక్తిని అమెరికాను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఘటన గురువారం ఉదయం కాల్పుల సంఘటన జరిగినప్పుడు ప్రదీప్ కుమార్ పటేల్, అతని కుమార్తె అకోమాక్ కౌంటీలోని లాంక్‌ఫోర్డ్ హైవేలోని స్టోర్‌లో పనిచేస్తున్నారు. అయితే జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్(44) అనే వ్యక్తి మద్యం కొనేందుకు డిపార్ట్ మెంటల్ స్టోర్ కు వెళ్లి మందురోజు రాత్రి స్టోర్ ను ఎందుకు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెంటనే కాల్పులు జరపడంతో ప్రదీప్ పటేట్, అక్కడికక్కడే మృతి చెందగా, ఊర్మి తీవ్రంగా గాయపడ్డింది. మార్చి 20న ఉదయం 5:30 గంటల తర్వాత కాల్పుల్లో గాయపడిన వ్యక్తి గురించి సమాచారం అందడంతో డిప్యూటీలను సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు అకోమాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. భవనంలో సోదా చేస్తున్నప్పుడు తుపాకీ గాయాలతో ఊర్మిను సెంటారా నార్ఫోక్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె చికిత్స పొందుతూ మరణించిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రదీప్ పటెల్ అతని భార్య హంసబెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల క్రితం గుజరాత్ నుంచి అమెరికా వెళ్లినట్లు సమాచారం.