calender_icon.png 19 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్కో ఫ్యాషన్ వీక్‌లో భారతీయ డిజైనర్లు

19-03-2025 01:58:48 AM

హైదరాబాద్, మార్చి 1౮ (విజయక్రాంతి): మాస్కో ఫ్యాషన్ వీక్‌లో భారతీయ డిజైనర్లు తళుక్కున మెరిశారు. ఈ సృజనాత్మక వేదికలో తమ విశిష్టతను చాటు కున్నారు. ఈ ఈవెంట్ మార్చి 13 నుంచి 18వ తేదీ వరకు మాస్కోలోని మానేజే సెం ట్రల్ ఎగ్జిబిషన్ హాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగో మాస్కో ఫ్యాషన్ వీక్ రష్యా, అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచింది.

ఈ షోలో భారతీయ డిజైనర్లు విశేషంగా ఆకట్టుకున్నారు. తమ ప్రత్యేక శైలులు, ప్రపంచ ఫ్యాషన్ రంగానికి చేసిన విశేష కృషి, ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ బ్రాండ్ ‘ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’,  సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఖాదీ- ఖాదీ ఇండియా తమ ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సమంతా చౌహాన్ పాల్గొన్నారు.

ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారత ఫ్యాషన్ వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహిస్తూ.. దాని ప్రగతికి కృషి చేసే లాభాపేక్షలేని సంస్థ. ఇది 400 పైగా ప్రముఖ భారతీయ డిజైనర్లను ప్రోత్సహిస్తూ భారతీయ ఫ్యాషన్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తుంది. ప్రముఖ భారతీయ డిజైనర్లు హస్తకళ ద్వారా భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పారు.