calender_icon.png 19 March, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూకేలో మెరిసిన భారత సంతతి

06-07-2024 12:39:59 AM

ఎంపీలుగా గెలిచిన 26 మంది భారత సంతతి వ్యక్తులు

న్యూఢిల్లీ, జూలై 5: ఒకప్పుడు మన భారతీయుల్ని బానిసలుగా చూసిన తెల్లదొరలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తే పరిపాలిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో అతడి పార్టీ ఓడిపోయినా కానీ అతడితో పాటు మరో 25 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.  

ప్రీతి పటేల్

ఈ ఐరన్ లేడీ యూకే సాధారణ ఎన్నికలు 2024లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎసెక్స్‌లోని వితమ్ స్థానం నుంచి గెలుపొందారు. ఈమె 2010 నుంచి వితమ్ ఎంపీగా సేవలందిస్తున్నారు. ఈమె బ్రిటన్ హోం మంత్రిగా కూడా సేవలందించారు. 

శివానీ రాజా.. 

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శివానీ లీస్టర్ ఈస్ట్ స్థానం నుంచి విజయం సాధించారు. ఈమె డెమోన్‌ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 

సుయెల్లా బ్రవెర్‌మాన్

భారత సంతతికి చెందిన సుయెల్లా ఫరేహమ్ అండ్ వాటర్ లువెల్లి నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున గెలిచింది. 

గగన్ మోహింద్రా

2002లో కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గగన్ ఈ ఎన్నికల్లో సౌత్ వెస్ట్ హర్ట్‌ఫోర్ట్ షైర్ నుంచి మరోసారి ఎన్నికయ్యారు. 

కౌటిన్హో

కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఈస్ట్ సర్రే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆమె 35.6 శాతం ఓట్లతో విజయకేతనం ఎగురేశారు. 

కనిష్క నారాయణ్

లేబర్ పార్టీకి చెందిన కనిష్క మొదటి మైనారిటీ ఎంపీగా రికార్డు నెలకొల్పింది.  

సీమా మల్హోత్ర

2011 నుంచి ఈమె ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ సారి కూడా తన నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 

మరికొంత మంది 

ఈ ఎన్నికల్లో వలేర్ల్ వాజ్, నడ్లా విట్టోమ్, ప్రీత్ కౌర్ గిల్, తన్మజీత్ సింగ్ దేశీ, సోజన్ జోసెఫ్, లిసా నంది, నవేందు మిశ్రా, సత్వీర్ కౌర్, జస్ అత్వాల్, బ్యాగీ శంకర్, హర్‌ప్రీత్ ఉప్పల్, వరిందర్ జస్, గురీందర్ జోసన్, సోన్లా కుమార్, సురీన బ్రాకెన్ బ్రిడ్జ్, కిరీత్, జీవున్ సందర్ లేబర్ పార్టీ తరఫున విజయం సాధించగా.. లిబరల్ డెమోక్రాట్ పార్టీ నుంచి మునీర విల్సన్ విజయం సాధించారు. లేబర్ పార్టీ తరఫునే  అనేక మంది భారత సంతతి వ్యక్తులు విజయం సాధించడం గమనార్హం.  

ఓడిపోయిన తెలుగు వ్యక్తులు 

యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి చెందారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి చెందిన నాగరాజు అధికారం చేజిక్కించుకున్న లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోగా.. కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసిన చంద్ర కన్నెగంటి కూడా ఓటమి పాలయ్యారు.