calender_icon.png 28 December, 2024 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ సింగ్‌కు భారత క్రికెట్ జట్టు ఘన నివాళి

27-12-2024 01:46:00 PM

మెల్‌బోర్న్: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) గురువారం రాత్రి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కన్నుమూశారు. మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పిస్తూ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCB)లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు భారత ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించి ప్రారంభించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Indian captain Rohit Sharma), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్,జస్ప్రీత్ బుమ్రా చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌(Former Prime Minister Manmohan Singh) మృతి పట్ల యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. 1932లో పంజాబ్‌లో జన్మించిన మన్మోహన్ సింగ్, 2004 నుండి 2014 వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేసి దేశ పాలన, ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు.