calender_icon.png 21 January, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్ సేనను అభినందించిన ప్రధాని మోడీ

04-07-2024 01:38:25 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో భారత క్రికెట్ జట్టు సమావేశం ముగిసింది. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో టీ-20 ప్రపంచకప్ సాధించిన విజేత జట్టును ప్రధాని అభినందించారు. టీ 20 ప్రపంచకప్ తో రోహిత్ సేన సగర్వంగా గురువారం ఉదయం భారత్ కు చేరుకుంది. భారత్ క్రికెట్ జట్టు హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ హోటల్‌లో చెఫ్ తయారు చేసిన ప్రత్యేక కేక్‌ను కట్ చేస్తూ కనిపించారు. కేక్ కట్ చేసిన అనంతరం టీమిండియా ప్రధాని మోడీ నివాసానికి చేరుకుంది. సాయంత్రం ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షోలో పాల్గొనుంది.