ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో విజయం సాధించిన టీమిండియా(Indian Cricket team) తాజాగా మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 6న (గురువారం) నాగ్‌పూర్‌లో జరిగే తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి సన్నాహకంగా భారత జట్టు ఆదివారం రాత్రి నాగ్‌పూర్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli, ), రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌తో సహా స్టార్ ప్లేయర్‌లు నేరుగా తమ జట్టు హోటల్‌కు వెళ్లే ముందు నాగ్‌పూర్ విమానాశ్రయం(Nagpur Airport)లో కనిపించారు. నేటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించేందుకు జట్టు సిద్ధమైంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుండగా, మూడో, చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే, భారత పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మొదటి రెండు వన్డేలకు దూరమవుతాడు. అయితే అతను మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. అతని గైర్హాజరీతో హర్షిత్ రాణా(Harshit Rana)ను జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ముందు ఇంగ్లండ్, ఇండియా రెండింటికీ కీలకమైన సన్నాహకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.