calender_icon.png 13 January, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూడల్ స్వభావంతో భారత కోర్టులు

30-12-2024 03:15:18 AM

అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): మన కోర్టులు ఫ్యూడల్ స్వభావంతో ఉన్నాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.ఘంటా చక్రపాణి అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం మినహా.. మిగతా దేశాలలోని మెజార్టీ కోర్టులు సాహిత్యాన్ని జోడించి తీర్పులు చెబుతాయని ఆయన అన్నారు.

దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివనాగిరెడ్డి రచించిన ‘తెలంగాణ శిథిలాలు వ్యధాభరిత కథనాలు’, మంగారి రాజేందర్ రచించిన ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’, శ్రీరామోజు హరగోపాల్ రచించిన ‘తెలంగాణ చరిత్ర తొవ్వలో’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదివారం ఎన్టీయార్ స్టేడియంలోని బుక్ ఫెయిర్‌లో తోపుడుబండి సాదిక్ వేదికపై జరిగాయి.

ఓయూ ప్రొ. ఎస్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దక్కన్ హెరిటే జ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ, సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి, ప్రొ. ఘంటా చక్రపాణి, చరిత్ర పరిశోధకులు బీవీ భద్రగిరీష్, డాక్టర్ డీఆర్ శ్యాంసుందర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. చారిత్రక ప్రదేశాలు భూమిలో కలిసిపోతూ కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిర్లక్ష్యానికి గురైన చారిత్రక ప్రదేశాలు, వివిధ అంశాలను ప్రధానం చేసుకుని పరిశోధనలు చేయడమే కాకుండా.. బుక్‌ఫెయిర్‌ల ద్వారా సమాజానికి పరిచయం చేయడాన్ని ఆయన అభినందించారు.