న్యూఢిల్లీ: అండమాన్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అండమాన్ జలాల్లో ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. భారత తీర రక్షక దళం ఇప్పటివరకు జరిపిన మాదకద్రవ్యాల రవాణాలో ఇదే అతిపెద్దది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయని రక్షణ అధికారులు తెలిపారు.