ఆసీస్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 అనధికారిక టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 142/3 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. ఒలివర్ పీక్ (117) సెంచరీతో రాణించాడు.
అన్‌మోల్‌జీత్ 4 వికెట్లు పడగొట్టాడు. అయితే భారత్ బ్యాటింగ్‌కు రాకుండా ఆసీస్‌ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 95 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ హోగన్ (29) పర్వాలేదనిపించాడు.అన్‌మోల్ జీత్ ఐదు వికెట్లతో మరోసారి మెరిశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన అన్‌మోల్ జీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.