హైదరాబాద్, అక్టో బర్ 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం అద్భుతమని, ప్రజలు ప్రజాభ వన్‌లో తమ సమస్యలు తెలిపేందుకు భారీగా తరలిరావడంపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆలిండియా సర్వీసెస్ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది.
మంగళవారం ప్రజాభవన్‌లో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్‌ఛార్జి చిన్నారెడ్డి, ప్రజావాణి రాష్ట్ర అధికారి దివ్యదేవరాజన్‌తో సమావేశమయ్యారు. ప్రజావా ణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు ను ఈ సందర్భంగా వారు వివరించా రు.
ప్రజలు ఆర్జీలు అందజేసిన వెంట నే సమస్యలు ఓపికతో విని సీఎం ప్రజావాణి పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు పంపుతామని, సీఎం ప్రజావాణి పేరిట రశీదులు ఇస్తామని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఫాలో ఆప్ అంటుందని తెలిపారు. మరోవైపు అర్జీలు స్వీకరించి వాటిపై ఎండార్స్‌మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.