calender_icon.png 27 September, 2024 | 5:44 AM

ఉక్రెయిన్‌కు భారత ఆయుధాలు

20-09-2024 01:58:26 AM

రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన కథనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఉక్రెయిన్‌తో యుద్ధంలో భారత్ మందుగుండు సామగ్రిని వినియోగిస్తున్నారంటూ వస్తోన్న అంతర్జాతీయ మీడియా కథనాలను ఇండియా ఖండించింది. అది పూర్తిగా ఊహాజనితమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని స్పష్టం చేసింది. ద్వంద వినియోగ సామగ్రి, ఆయుధాల ఎగుమతుల్లో భారత్ ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా యుద్ధాన్ని పరిష్కరించుకోవాలంటూ రష్యా, ఉక్రెయిన్‌కు భారత్ సూచిస్తోందని వెల్లడించింది.

కాగా, భారత్‌కు చెందిన శతఘ్ని తూటాలు ఉక్రెయిన్ వినియోగిస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత ఆయుధ తయారీ సంస్థలు అమ్మిన షెల్స్‌ను ఐరోపా వినియోగదారులు ఉక్రెయిన్‌కు దారి మళ్లిస్తున్నారని ఆ కథన సారాంశం. దీనిపై రష్యా అభ్యంతరం చెబుతున్నప్పటికీ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు భారత్ తీసుకోలేదని తెలుస్తోంది.