calender_icon.png 4 October, 2024 | 6:46 PM

ఇండియన్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిక్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

04-10-2024 03:25:35 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ తెలంగాణ, ఇండియన్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిక్ కామారెడ్డి జిల్లా చారిటీ ఆక్టివిటీ సంయుక్తంగా వైద్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు కామారెడ్డి మెడికల్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులైన ఆరుగురిని గుర్తించి వారికి చెక్కులను పంపిణీ చేసినట్లు  ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్   కామారెడ్డి జిల్లా అధ్యక్షులు  డాక్టర్ రాజేశ్వర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఐఏపి కామారెడ్డి జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయరాజు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఐఏపీ ద్వారా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం మెడికల్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులను గుర్తించి ఆరుగురికి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, ప్రొఫెసర్ శ్రీనివాస్ కళ్యాణి, పిల్లల వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర గౌడ్, డాక్టర్ వెంకట్రాజం, డాక్టర్ నరేందర్ రవు, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ అరవింద్ గౌడ్,  డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ నాగేందర్ , మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.