calender_icon.png 16 January, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ x బంగ్లాదేశ్

26-07-2024 12:10:07 AM

ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకునేందుకు భారత అమ్మాయిల జట్టు రెండు అడుగుల దూరంలో నిలిచింది. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని భారత్ అజేయంగా నాకౌట్‌లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది.

దంబుల్లా: మహిళల ఆసియాకప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు తొలి సెమీఫైనల్ జరగనుంది. దంబుల్లా వేదికగా నేడు జరగనున్న మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోన్న బంగ్లాదేశ్ గెలుపుపై దృష్టి సారించింది. మొత్తానికి భారత బ్యాటింగ్‌కు.. బంగ్లా బౌలింగ్‌కు మధ్య సెమీస్ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నీలో షఫాలీ వర్మ 158 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్ ప్రీత్, రోడ్రిగ్స్, హేమలత, రిచా ఘోష్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది.

ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. మరోవైపు బంగ్లా జట్టు బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తుంది. ఆ జట్టు స్పిన్నర్లు నహిదా అక్తర్, రాబియా ఖాన్‌లు అద్భుత బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. ముర్షిదా ఖాతున్, కెప్టెన్ నిగర్ సుల్తానా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. ఇక రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫైనల్ ఆదివారం జరగనుంది.