calender_icon.png 3 March, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బౌలర్ల ఊచకోత.. భారత్ ఘన విజయం

02-03-2025 11:02:57 PM

దుబాయి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్‌(Dubai)లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేన్ విలియమ్సన్(81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో యంగ్ 22, రచిన్ 6, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12, శాంట్నర్ 28 రన్స్ చేశారు. భారత్ బౌలర్లలో వరుణ్ 5 వికెట్లతో సత్తా చాటగా, కుల్దీప్ 2, అక్షర్, హార్దిక్, జడేజా తలో వికెట్ తీశారు. కాగా, భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (79) కీలక ఇన్నింగ్స్ ఆడగా, అక్షర్ పటేల్ (42) రానించాడు. చివర్లో హర్దిక్ పాండ్య (45) పరుగులతో దూకుడుగా ఆడాడు.

కేఎల్ రాహుల్ (23), రోహిత్ శర్మ (15), శభ్ మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ(11) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్ త్వరగా వికెట్లు కోల్పోయింది. అయితే, శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), అక్షర్ పటేల్ టీమ్ ఇండియాను ఆదుకొని, నాలుగో వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పరు. అటు న్యూజిలాండ్‌ బౌలర్లలో మాట్ హెన్రీ స్టార్ బౌలర్‌గా నిలిచి ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్ లలో గెలిచినా భారత జట్టు 6 పాయింట్లతో గ్రూప్-ఎ లో మొదటిస్థానంలో నిలిచింది. దీంతో భారత్ మంగళవారం(మార్చి 04) రోజున ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్(Semifinal) పోరుకు సిద్దం కాగా, బుధవారం రోజున సౌతాఫ్రికాతో న్యూజిలాండ్‌ తలపడనుంది.