28-04-2025 01:08:28 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత్ తన పొరుగున ఉన్న దేశాలకు ఎప్పటికీ హాని తలపెట్టదని, అయితే ఎవరైనా భారత్‌కు హాని చేస్తే మాత్రం వారికి దీటుగా సమాధానం చెప్పడం తప్ప వేరే మార్గం లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పం దించారు. ‘సనాతన ధర్మం సత్యం, స్వచ్ఛత, కరుణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ వంటి నాలుగు స్తంభాలపై నిల బడింది.
కొన్ని సందర్భాల్లో దురాక్రమణదారుల చేతిలో పరాజయం పాలవకుండా ఉండటం మన విధి. ఇది సనాతన హిందూ ధర్మంలో ఒక ముఖ్య నియమం. దీనిలోని అహింసా సూత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. ఈ సూత్రాలు నచ్చే ఎంతో మంది వీటిని హృదయపూర్వకంగా స్వీకరించారు. అయితే కొంత మంది మాత్రం వీటి ని అంగీకరించకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ప్రజల భద్రత కోసం రాజు తన కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తిస్తాడు’ అని పేర్కొన్నారు.