calender_icon.png 28 September, 2024 | 10:46 PM

2031కల్లా మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

20-09-2024 12:00:00 AM

ఎస్ అండ్ పీ నివేదిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత్ 2030-31కల్లా ప్రపంచంలో మూడో  పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజా నివేదికలో పేర్కొంది. సంస్కరణలు కొనసాగడం, మౌలిక రంగంలో పెట్టుబడులు చేయడం, కొత్త టెక్నాలజీలను అవలంబించడం తదితర అంశాలపై దృష్టిపెడితే భారత్ వృద్ధి బాట లో నడుస్తుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో భారత్ వార్షిక వృద్ధి రేటు 6.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి అవకాశాలు, మెరుగైన నియంత్రణల కారణంగా భారత ఈక్విటీ మార్కెట్లు డైనమిక్‌గా ఉంటాయని ఎస్ అండ్ పీ అంచనా వేసింది.

కొద్ది నెలలుగా భారతీయ ప్రభుత్వ బాండ్లలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రపంచ వాణిజ్య అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు భారత్ మౌలిక రంగాన్ని అభివృద్ధి చేయాలని, ప్రత్యేకంచి విస్త్రతమైన సముద్ర తీరాన్ని వాణిజ్యానికి అనువుగా మలచుకోవాలని రేటింగ్ ఏజెన్సీ సూచించింది. ఎగుమతుల్ని పెంచుకోవడానికి, బల్క్‌గా కమోడిటీలను దిగుమతి చేసుకోవడానికి రేవుల మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చాలన్నది. దేశంలో విద్యుత్‌కు పెరుగుతున్న డిమాం డ్ దృష్ట్యా పునరుత్పాదక, గ్రీన్ ఎనర్జీలపై దృష్టిపెట్టాలని సూచించింది.