హరారే: మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించింది. హరారేలో జరిగిన మూడవ T20Iలో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 20 ఓవర్లకు గాను భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరులుగు చేసింది. లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 చేసింది. భారత బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్(66), రుతురాజ్ గైక్వాడ్(49), యశస్వి జైస్వాల్(36) పరుగులు చేశారు. ఈ మ్యాచులో భారత బౌలర్లు సుందర్ 3, అవేష్ ఖాన్ 2, ఖలీల్ 1 వికెట్ తీసుకున్నారు. జింబాబ్వే తరఫున సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజారబానీ చెరో రెండు వికెట్లు తీశారు. డియోన్ మేయర్స్ 65 పరుగులతో రెచ్చిపోయిన మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.