భారత్ vs న్యూజిలాండ్ 3వ టెస్ట్ డే 1: వాషింగ్టన్ సుందర్ భారత్‌కు మూడో వికెట్ అందించాడు. రచిన్ రవీంద్రను 5 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో విల్ యంగ్ (38), డారిల్ మిచెల్(11) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచులో సుందర్ ఇప్పటికే రెండు వికెట్లు తీసుకున్నాడు. మూడో టెస్టు మ్యాచులో ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇచ్చారు. న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగుల చేసింది.
మరోవైపు, ఆటలో పైచేయి సాధించేందుకు భారత బౌలర్లు మరికొన్ని వికెట్లపై కన్నేశారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరోగ్యం బాగోకపోవడంతో విశ్రాంతి తీసుకున్నారు. అతని స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు, స్టార్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌కు కూడా విశ్రాంతి ఇవ్వగా, అతని స్థానంలో ఇష్ సోధి న్యూజిలాండ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. అతనితో పాటు, టిమ్ సౌథీ స్థానంలో మాట్ హెన్రీ వచ్చాడు.