రాజ్‌కోట్: భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్‌లు చెరో సెంచరీ చేయడంతో ఐర్లాండ్(India Women vs Ireland Women)తో బుధవారం జరిగిన మూడో, చివరి మహిళల వన్డేలో భారత్ తమ అత్యధిక స్కోరు 435/5 నమోదు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంధాన (135), రావల్ (154) 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఐర్లాండ్ పై వన్డేలో 5 వికెట్ల కోల్పోయి భారత్ మహిళల జట్టు ఈ ఫీట్ ను సాధించింది. మహిళల వన్డే క్రికెట్(Women's ODI Cricket)లో భారత్ నాలుగో అత్యధిక స్కోర్ చేసింది. మహిళల క్రికెట్ జట్టు పురుషుల వన్డే జట్టు రికార్డు(418) దాటేసింది. 2011లో వెస్టిండీస్ పై టీమిండియా 418 పరులుగు చేసింది. మహిళల వన్డే క్రికెట్ లో 400 పరుగులు దాటిన మూడో జట్టుగా భారత్ రికార్డు(Indian record) నమోదు చేసింది. 26.4 ఓవర్లలోనే ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక 233 పరుగులు చేశారు. స్మృతిమంధాన(135), ప్రతీక(154) సెంచరీలతో చెలరేగిపోయారు. స్మృతి 80 బంతుల్లో 7 సిక్సులు, 12 ఫోర్లతో 135 పరుగులు చేయగా, ప్రతీక 129 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్ తో 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2 వికెట్లు, ఫ్రేయా, కెల్లీ, డెంప్సీ చెరో వికెట్ తీసుకున్నారు.