calender_icon.png 4 March, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 పరుగులు దాటిన ఆసీస్ స్కోర్

04-03-2025 04:07:27 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025( ICC Champions Trophy 2025) సెమీ-ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచులో ఆసీస్ స్కోర్ 100 పరుగులకు చేరింది. ఆసీస్ బ్యాటర్లు  40 బంతులుగా బౌండరీ కొట్టలేకపోయారు. 21 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 105 చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(36), లబుషేన్(24) నిలకడగా ఆడుతున్నారు. మూడో వికెట్ కు అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. తన బౌలింగ్ లో లబుషేన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో బంతిని త్రో చేస్తూ అక్షర్ పటేల్ కిందపడ్డాడు. దీంతో ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చి చికిత్స అందించాడు. అనంతరం అక్షర్ పటేల్ తిరిగి బౌలింగ్ ప్రారంభించాడు.