calender_icon.png 26 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడిలైట్‌ టెస్ట్‌: 180 పరుగులకే భారత్‌ ఆలౌట్‌

06-12-2024 03:19:48 PM

అడిలైడ్ టెస్టు: భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైట్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ డే/నైట్ టెస్టు మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. కమిన్స్ బౌలింగ్ లో బుమ్రా(0)ఔట్ అయ్యాడు. స్లిప్ లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.  ఈ మ్యాచ్ లో నితీస్ కుమార్ రెడ్డి(42) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్(37), శుభ్ మన్ గిల్(31), అశ్విన్(22), రిషబ్ పంత్(21) చేశారు. మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. స్టార్క్ కాకుండా కమిన్స్ 2, బోలాండ్ కు 2 వికెట్లు దక్కాయి. అటు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆట ప్రారంభించింది. క్రీజులోకి ఉస్మాన్ ఖవాజా, మెక్ స్వీనీ ఉన్నారు.