calender_icon.png 26 December, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ కు షాక్.. విరాట్ కోహ్లీ ఔట్.. 81/4

06-12-2024 11:38:59 AM

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆడిలైట్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతున్న మ్యాచులో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. స్పల్ప వ్యవధిలో భారత్ కు మిచెల్ షాక్ ఇచ్చాడు. గత టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని(7) పరుగులకే ఔట్ చేశాడు. స్టార్క్ వేసిన బంతిని ఆడే క్రమంలో స్లిప్ లో ఉన్న స్మిత్ కు విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. మూడు ఓవర్ల వ్యవధిలో టీమిండియా మూడు వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ (31) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ఇప్పటి వరకు  జరిగిన ఆటలో భారత్ 22.1 ఓవర్లలో నాలులు కీలక వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(01), రిషబ్ పంత్(4) పరుగులతో ఆడుతున్నారు. మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శన చూపిన జైస్వాల్, విరాట్ కోహ్లీ ఈ మ్యాచులో భారత్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు.