calender_icon.png 26 December, 2024 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్ రాహుల్, గిల్ మధ్య హాఫ్ సెంచరీ

06-12-2024 11:15:37 AM

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆడిలైట్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మొదటి టెస్టులో రెచ్చిపోయి ఆడిన యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ లోలి బంతికే వికెట్ కోల్పోయాడు. దీంతో భారత్ కు పెద్ద షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ జైస్వాల్ ను ఎల్బీ చేశాడు. శుభ్ మన్ గిల్-కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం చేశారు. ఆసీస్ బౌలర్ బోలాండ్ వేసిన మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంనచి కేఎల్ రాహుల్ బయటపడ్డాడు. తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన గిల్ దూకుడు పెంచాడు. మిచెల్ స్టార్క్ విసిరిన బంతులను బౌండరీలు రాబట్టాడు.  ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.