calender_icon.png 1 March, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కంది ఐఐటి హైదరాబాద్ కు భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్‌ఖడ్ రాక

01-03-2025 11:01:19 AM

ఉపరాష్ట్రపతి రాక తో భద్రతా ఏర్పాట్లు 

సంగారెడ్డి,(విజయక్రాంతి): భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్ కంది శివారులో ఉన్న ఐఐటి హైదరాబాద్ కు రానున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఆదివారం భారత ఉపరాష్ట్రపతి పర్యటన ఐఐటీలో  ఉండడం తో జిల్లా ఉన్నత అధికారులతో  భద్రత ఏర్పాట్లపై  కలెక్టరేట్ సమావేశ మందిరం కలెక్టర్  క్రాంతి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సజావుగా జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.  భద్రతా ఏర్పాట్లు ఇతర ఏర్పాటులో ఎలాంటి లో టు పాట్లు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. 

ఉప రాష్ట్రపతి రాక సందర్భంగా ఐఐటి హైదరాబాద్ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని జిల్లా ఎస్పీకి కలెక్టర్ ఆదేశించారు. ఉపరాష్ట్రపతి వచ్చి వెళ్లే వరకు ఐఐటి ప్రాంగణంలో డ్రోన్ కెమెరాలు ఇతర ఫ్లయింగ్ పరికరాల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల సౌకర్యం వేదిక ఏర్పాటు వంటి విషయాలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా పరిగణించాలని కలెక్టర్ సూచించారు. పోలీసు శాఖ, రవాణా శాఖ కలిసి పూర్తిస్థాయి భద్రతా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఐఐటి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ,  పోలీసు శాఖ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు .మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత పర్యటన దేశాలను పరిశుభ్రంగా ఉంచడం పర్యావరణహిత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఐఐటి హైదరాబాదులో నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు కార్యక్రమానికి హాజరై అధికారులకు ప్రత్యేక గైడ్ లైన్స్  సిద్ధం చేయాలని సూచించారు. ఆహార భద్రత వైద్యశాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ వివరించారు. అగ్నిమాపక నివారణకు ఐఐటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పైరేట్స్ సేఫ్టీ చెక్ నిర్వహించాలని ఫైర్ టెండర్లు సిద్ధంగా ఉంచాలనిఆదేశించారు.

ముఖ్యంగా వేదిక వద్ద వాహన పార్కింగ్ ప్రాంతాల్లో అత్యవసరమైన మార్గాలను పరిశీలించాలన్నారు. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో విఐపి రూపంలో ప్రధాన రహదారులు మరమ్మతులు వెంటనే చేయాలని బారికేడింగ్ ఐఐటి క్యాంప్ పాస్ రోడ్లలో తగిన చోట్ల భారీకేట్లు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని  సూచించారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు అవసరమైన ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ సదుపాయాలు ముఖ్యమైన వేదిక వద్ద సౌండ్ సిస్టం కమ్యూనికేషన్ లైన్  సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలని  ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.

రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారిక ఆహ్వానితుల లిస్ట్ సమీక్ష జరపాలని హాజరయ్యే విఐపి లకు గుర్తింపు కార్డులు ముందుగానే అందించాలని సమావేశాలు జరిగే ప్రాంతాల పరిశుభ్రత ఐఐటి క్యాంపస్ రవాదారుల వెంట స్వచ్ఛత చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సిద్ధంగా ఉంచడం ఆకస్మిక పరిస్థితుల నివారణ కోసం రెవెన్యూ అధికారులు బృందం వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో ఆహార నాణ్యత తనిఖీలు విఐపి లాంజ్ ,క్యాటరింగ్ సర్వీస్ ప్రాంతాల్లో ఆహార నాణ్యత తనిఖీ చేసి ధ్రువీకరించాలని ఆహార నమూనాల పరిశీలన ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఇతర విఐపి లకు అందించబోయే ఆహార పదార్థాలను ముందుగా టెస్టు చేసి అప్రూవ్ చేయాలని ఆదేశించారు.

తాగునీటి నాణ్యత బాటిల్ వాటర్ ను తాగునీటి వనరుల ను ల్యాబ్లో టెస్టు చేసి అనుమతి తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండు అత్యవసర అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని ఒక మొబైల్ హెల్త్ యూనిట్ సిద్ధంగా ఉంచాలని వైద్యులు ,నర్సింగ్ సిబ్బంది స్టాండ్ బై ఉండాలని ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం గుండెపోటు, గ్యాస్ ట్రబుల్ లకు తక్షణ వైద్య సేవల కోసం స్పెషల్ మెడికల్ టీం అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు అత్యవసరమైతే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో రెడీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భద్రతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకోవాలని అన్ని భద్రతా నియమాలు పాటించాలని సూచించారు . వీఐపీలు ఎవరికి ఎలాంటి అనుమతులు అవసరమో ముందుగానే నిర్ణయించాలన్నారు.

ఐఐటి ప్రాంగణంలో సీసీటీవీ ల మానిటరింగ్ ముఖ్యమైన ప్రాంతాల్లో హై రిజల్యూషన్ కెమెరాల ఏర్పాటు తదితర పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఉప రాష్ట్రపతి పర్యటన జరిగే ప్రాంతంలో ఏమాత్రం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని బ్యాకప్ పవర్ అందుబాటులో ఉంచడం ప్రాథమిక విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన చేసే ప్రాంతంలో విద్యుత్ లైన్ ల తనిఖీ,పర్యటనకు ముందు ట్రాన్స్ఫార్మర్లు మేజర్ విద్యుత్ లైన్ లను సబ్ స్టేషన్ లను సక్రమంగా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి అన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన సేఫ్టీ కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.