calender_icon.png 25 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రదేశాల ప్యాకేజీపై భారత్ అసంతృప్తి

25-11-2024 02:45:07 AM

బాకు, నవంబర్ 24: పర్యావరణ పరిరక్షణ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ధనిక దేశాల నిర్ణయంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అజర్‌బైజాన్ రాజధాని బాకు నగరంలో ఐరాస ఆధ్వర్యంలో కాప్----- చర్చలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా వాతావరణంలో వస్తున్న మార్పులపై పోరాడడానికి వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు 300 బిలియన్ డాలర్ల పర్యావరణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో ధనిక దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చకుండా వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయని భారత్ మండిపడింది.

ఈ ఒప్పంద పత్రం భ్రమ తప్ప మరేమీ కాదని తెలిపింది. వర్ధమాన దేశాల అవసరాలు, ప్రాధాన్యాలను ఈ ప్యాకేజీ  పరిష్కరించలేదని అభిప్రాయపడింది. సీబీడీఆర్, ఈక్విటీ సూత్రానికి ఈ ఒప్పందం విరుద్ధంగా ఉందని భారత బృందం ప్రతినిధి చాందినీ రైనా అభిప్రాయపడ్డారు. భారత్ నిర్ణయానికి నైజీరియా దేశం మద్దతు తెలిపింది.