calender_icon.png 20 January, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖోఖోలో అజేయ భారత్

20-01-2025 12:41:37 AM

* టైటిళ్లు నెగ్గిన మహిళలు, పురుషులు

* తొలి ప్రపంచకప్‌లో సత్తా చాటిన భారత్

న్యూఢిల్లీ: తొలిసారి జరిగిన ఖోఖో ప్రపంచకప్‌లో భారత్ సత్తా చాటింది. ఒకే రోజు రెండు పోటీల్లో గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పురుషుల జట్టు, మహిళల జట్టు విజయాలు సాధించాయి. తొలుత మహిళల జట్టు 78 తేడాతో నేపాల్‌ను చిత్తు చేయగా... ఆ తర్వా త పురుషుల జట్టు కూడా 54 తేడాతో అదే నేపాల్‌ను చిత్తు చేసి తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఈ పోరులో భారత్ అపజ యం అనేదే లేకుండా ట్రోఫీని కైవసం చేసుకోవడం గమనార్హం. టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన రెండు జట్లు కూడా ట్రోఫీని ముద్దాడాయి.

పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లోనే నేపాల్‌ను 42 తేడాతో ఓడించిం ది. ఫైనల్లో కూడా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ప్రతీక్ సేనకు నేపాల్ పోటీనిచ్చినా కానీ వారి పోరాటం మాత్రం సరిపోలేదు. సెమీస్‌లో సౌతాఫ్రికాకు చెక్ పెట్టిన భారత్ ఫైనల్లో నేపాల్‌ను కంగుతినిపించింది. 

ఖోఖో జట్లకు అభినంధనలు

మొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలిచిన మహిళల, పురుషుల జట్లకు అభినందనలు. ఈ విజయం ఆట పట్ల మీ నిబద్ధతను, మీ టీమ్ వర్క్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ విజయంతో ఖోఖో మరింత వెలుగులోకి రావడం ఖాయం

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని