calender_icon.png 9 October, 2024 | 4:56 AM

16 పతకాలతో అగ్రస్థానంలో భారత్

05-10-2024 12:00:00 AM

ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్

లిమా (పెరూ): పెరూ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. శుక్రవారం భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన ముఖేష్, రాజ్‌వర్ధన్ పాటిల్, హర్సీమర్ సింగ్ త్రయం పసిడి పతకం కైవసం చేసుకుంది.

ముఖేష్‌కు ఇది ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్వర్ణం కావడం విశేషం. వ్యక్తిగత ఫైనల్స్‌లో ముఖేష్ ఐదో స్థానంలో నిలవగా.. రాజ్‌వర్ధన్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్నాడు.

ఇప్పటివరకు 16 పతకాలు సాధించిన భారత్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 11 స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలున్నాయి. చైనా 4 పతకాలు (3 స్వర్ణాలు, ఒక రజతం), అమెరికా 10 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.