calender_icon.png 9 January, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2047 నాటికి ఆర్థిక వ్యవస్థగా భారత్ 2.5 ట్రిలియన్ డాలర్లు

09-01-2025 01:35:54 AM

  1. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన 
  2. ఘనస్వాగతం పలికిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
  3. ఒకే వాహనంలో మోదీ, బాబు, పవన్
  4. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  5. మేకిన్ ఇండియాతో దేశం రూపురేఖలు మారాయి: చంద్రబాబు
  6. అందుకు మోదీకి కృతజ్ఞతలు: పవన్

  7. విశాఖపట్నం, జనవరి 8: భారత ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని రూ. 2 లక్షల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

  8. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోదీని ఆకాశానికెత్తేశారు. ప్రపంచం మొత్తం మెచ్చిన నాయకుడు మోదీ అని సీఎం చంద్రబాబు తెలపగా.. దేశ బలోపేతం కోసం నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరగకుండా మోదీ కృషి చేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. 

ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ.. 

ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీలో ఎన్డీఏ కూటమి 93 శాతం స్ట్రుక్ రేట్‌తో విజయదుందుభి మోగించింది. ఈ కాంబి నేషన్ ను మీరు భవిష్యత్‌లోనూ చూస్తారు.

ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏదే విజయం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారు. మేకిన్ ఇండియాతో దేశం రూపురేఖలు మారాయి. త్వరలో మోదీ అ మరావతికి రావాలని కోరుకుంటున్నా. 2047 నాటికి ప్రపంచంలోనే ఫస్ట్ లేదా సె కండ్ ప్లేస్‌లో ఉంటాం’ అని బాబు అన్నారు. 

మోదీ ఆశయం అదే: పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర అభివృద్ధికి సహకారం అంది స్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే మోదీ లక్ష్యం. బలమైన భారత్ కోసం మోదీ నాలుగున్నర దశాబ్దాలుగా శ్రమిస్తున్నారు. నిందలను విజయాలకు ఇంధనంగా మోదీ మార్చుకుంటున్నారు.’ అని అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

మీ ప్రేమకు కృతజ్ఞతలు

ప్రధాని మోదీ తెలుగులో ప్రసం గం ప్రారంభించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదం వల్లే వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చాం. 2047 నాటికి 2.5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మన దేశ ఆర్థిక వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సీఎం చంద్రబాబు లక్ష్యాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. 2030 లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హై డ్రోజన్ ఉత్పత్తే మా లక్ష్యం.’ అని అన్నారు. 

ఒకే వాహనంపై ముగ్గురు నేతలు

విశాఖలోని సిరిపురం జంక్షన్ నుంచి బహిరంగ సభా వేదిక వరకు రోడ్ షో నిర్వహించగా.. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఒకే వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మోదీకి స్వాగతం పలికారు.

అనంతరం సభా వేదిక మీద సీఎం బాబు మోదీని సత్కరించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూడి మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు, రైల్వేజోన్, క్రిస్ సిటీ, కృష్ణపట్నం ఇండ స్ట్రియల్ నోడ్, గుంటూరు నగర్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులు, గుత్తి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు శంకు స్థాపన చేశారు. అలాగే చిలకలూరి పేట లో ఆరు లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేశారు.