న్యూఢిల్లీ: రానున్న పదేళ్లలో భారత ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్-50కి చేరుకుంటుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ జోస్యం చెప్పారు. ‘ రానున్న పదేళ్లలో ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్-50లోకి అడుగపెట్టేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం జట్టు మొత్తం యంగ్ టాలెంట్‌తో నిండి ఉంది.
మూలాల్లో నుంచి ఆటను వెలికితీయాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. 1992లో తొలిసారి ఫిఫా ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టగా.. భారత్ (94) బెస్ట్ ర్యాంకును 1996లో అందుకుంది. తాజాగా విడుదల చేసిన ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 127వ స్థానంలో ఉంది. ఆసియా దేశాలైన జపాన్, ఇరాన్, కొరియాతో పాటు ఆస్ట్రేలియా వరుసగా 15, 18, 23, 26 స్థానాల్లో ఉన్నాయి.