03-03-2025 01:11:27 AM
కివీస్‌పై సునాయాస విజయం
రేపు కంగారులతో అమీతుమీ
దుబాయ్, మార్చి 2: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగం గా ఆదివారం దుబాయ్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించి సెమీస్‌కు చేరింది. 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. ఈ గెలుపుతో గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం ఆసీస్‌తో జరిగే తొలి సెమీస్‌లో తల పడనుంది.
టాస్ ఓడి మొదట గా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించారు. చివర్లలో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు.
250 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ భారత స్పిన్నర్ల ధాటికి 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విలియమ్సన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు.
స్కోర్ బోర్డ్
ఇండియా: 249/ 9 (50 ఓవర్లు)
న్యూజిలాండ్: 205 ఆలౌట్ (45.3 ఓవర్లు)