calender_icon.png 25 April, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ మరో కీలక నిర్ణయం

25-04-2025 12:27:58 AM

పాకిస్థాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. బుధవారం పాక్‌పై దౌత్యపరమైన ఆంక్ష లు విధించిన మరుసటిరోజే, గురువారం పాక్ ప్రభుత్వానికి సంబంధిం చిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా పాకిస్థాన్ ఖాతాను భారత్‌లో నిలిపివేయాలని ఎక్స్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖమంత్రి కోరా రు.

ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎక్స్, పాక్ ప్రభత్వ అధికారిక ఖాతాను భారత్‌లో నిలిపివే సింది. దీంతో అందులోని కంటెంట్ ను భారత యూజర్లు చూడలేరు. క శ్మీర్‌లో భారత పౌరులపై జరిగిన ఘోరమైన దాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ మద్ద తు ఇస్తోందని భారత్ పేర్కొంది.