- 25 నుంచి 27 మధ్య నిర్వహణ
- దేశవిదేశాల నుంచి 600-700 మంది ప్రతినిధులకు ఆహ్వానం
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి 27 మధ్య భారత్ సమ్మిట్ పేరుతో అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మొదటి భారత్ సమ్మిట్ ఇదే. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతి వృత్తంతో సమ్మిట్‌ను నిర్వహించనుంది.
గ్లోబల్ థింకర్స్, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, ప్రవాసులు, వివిధ రంగాల నిపుణులు మొత్తం 600 నుంచి 700 వరకు ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పింది. ఈ సమ్మిట్ నిర్వహణ కోసం సమృద్ధ భారత్ ఫౌండేషన్ (ఎస్‌బీఎఫ్) అనే ఎన్జీవోతో కలిసి ప్రభుత్వం పనిచేయనుంది.