calender_icon.png 16 January, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో భారత్ సత్తా

18-12-2024 02:05:38 AM

  • విశ్వవేదికపై మెరిసిన చిన్నారులు
  • ఆరు బంగారు పతకాలు కైవసం

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: విశ్వవేదికపై భారత చిన్నారులు సత్తా చాటారు. రొమానియా వేదికగా డిసెంబర్ 2 నుంచి 11 వరకు జరిగిన 21వ అంతర్జాతీయ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ (ఐజేఎస్వో)లో ఆరు బంగారు పతకాలు సాధించారు. 52 దేశాలకు చెందిన 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఐజేఎస్వో పోటీల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టుల నుంచి క్లిష్టతరమైన టాస్కులు ఉంటాయి. పాల్గొన్న పోటీదారుల్లో పది శాతం మందికి బంగారు పతకాలు, 20 శాతం మందికి రజతాలు, 30 శాతం మందికి కాంస్యాలు దక్కాయి. భారత్ నుంచి ఆరుగురికి బంగారు పతకాలు దక్కాయి. 

పతకాలు సాధించిన విద్యార్థులు

1) స్వేతాంక్ అగర్వాల్. 2) భవ్య గున్‌వాల్. 3) జినాష్ షా. 4) మానస్ గోయల్. 5) హర్షిత్ సింగ్లా. 6) ప్రనీత్ మాథర్.

భారత ప్రభుత్వం ఈ విద్యార్థులకు ఎంతో సహాయం చేసింది. వీరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది.