calender_icon.png 27 September, 2024 | 1:00 PM

భద్రతా మండలిలో భారత్ ఉండాలి

27-09-2024 12:56:22 AM

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భద్రతామండలిని మరింతగా విస్తరించాలని.. భారత్ వంటి వర్ధమాన దేశాలకు కచ్చితంగా అవకాశం కల్పించా లని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ కోరారు. గురువారం ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించిన ఆయన ‘భద్రతా మండ లి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలం. భారత్, జర్మ నీ, జపాన్, బ్రెజిల్‌కూ శాశ్వత సభ్యత్వం ఉండా లి. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి’ అని పేర్కొన్నారు. యూఎన్‌ఎస్‌సీ సమర్థతను పునరుద్ధరించడానికి కేవలం ఈ మార్పులు సరిపోవన్నారు.

యూఎన్‌ఎస్‌సీ అవలంబిస్తున్న విధానాల్లో మార్పులు రావా ల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సామూహిక నేరాల కేసుల్లో వీటో అధికారాలకు పరిమితులు, శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన వ్యూహాలపై దృష్టి పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టే సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. మరిన్ని దేశాలు తమకు భద్రతా మండలిలో సభ్యత్వం కావాలని కోరుతున్నాయి. భారత్ తన డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది.