calender_icon.png 2 October, 2024 | 9:55 PM

కంబోడియాలో సైబర్ ఉచ్చు.. 67 మంది ఇండియన్స్ సేఫ్

02-10-2024 06:16:29 PM

న్యూఢిల్లీ: కంబోడియాలో మోసపూరిత ఉద్యోగ స్కామ్‌లలో చిక్కుకున్న 67 మంది భారతీయ పౌరులను కంబోడియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో నమ్ పెన్‌లోని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా రక్షించింది. స్కామ్ కాంపౌండ్స్‌లో చాలా మందిని సైబర్‌క్రైమ్ కార్యకలాపాలకు ఆకర్షించిన నకిలీ ఉద్యోగ ఆఫర్‌ల సమస్యను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను రెస్క్యూ ఆపరేషన్ టీం గుట్టురట్టు చేసింది. 

కంబోడియాలోని నమ్ పెన్‌లోని భారత రాయబార కార్యాలయం సెప్టెంబర్ 22న రక్షించబడిన 67 మంది భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియను ప్రారంభించింది. ఎంబసీ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 15 మందితో కూడిన మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 30న బయలుదేరగా, మిగిలిన 28 మంది రాబోయే కొద్ది రోజుల్లో భారత్‌కు చేరుకోనున్నారు. రాయబార కార్యాలయం నిర్దిష్ట లీడ్స్ అందించిన తర్వాత ఈ వ్యక్తులను కంబోడియన్ పోలీసులు రక్షించారు. కంబోడియాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 770 మందిని భారత ఎంబసీ కాపాడింది.