calender_icon.png 24 February, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్బన్ విస్కీపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన భారత్

16-02-2025 12:12:43 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: బోర్బన్ విస్కీపై భారత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 50 శాతం తగ్గించింది. బోర్బన్ విస్కీపై కస్టమ్స్ డ్యూటీని 150శాతం నుంచి 100 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంటూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

దక్షిణ ఆసియా మార్కెట్‌లో పన్నులు అ న్యాయంగా ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీ వల అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ట్రంప్‌తో సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు భారత ప్రభు త్వం బోర్బన్ విస్కీపై కస్టమ్స్ డ్యూ టీని 50శాతం తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో దేశం లో జాక్ డేనియల్స్, జిమ్ బీమ్ వంటి బ్రాండ్లకు ప్రయోజనం చేకూరనుంది.