- మత్స్య-6000 పేరుతో సబ్‌మెర్సిబుల్ రెడీ
- 12 గంటల్లో సాగర గర్భానికి వెళ్లొచ్చేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ, నవంబర్ 1: సముద్రాలను అన్వేషించే దిశలో భారత్ కీలక ముందడుగు వేసింది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగం గా కేవలం 12 గంటల్లో సముద్రంలోని 6000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ‘మత్స్య అనే సబ్‌మెర్సిబుల్ వాహనాన్ని డీఆర్‌డీఓ సిద్ధం చేసింది.
దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా దీన్ని టైటాన అలాయ్‌తో శాస్త్రవేత్తలు తయారు చేశారు. సముద్రగర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతోపాటు సాగర గర్భంలో ఒత్తిడిని తట్టుకుంటూ పరిశోధనల కోసం 6 గంటలు ఉండేందుకు వీలుగా అత్యంత దృఢంగా దీన్ని చేసింది.
అత్యంత సంక్లిష్ట సమయంలో 96 గంటలపాటు సిబ్బంది ఇందులో విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం దాదాపు 67 ఆక్సిజన్ సిలిండర్లను శాస్త్రవేత్తలు అమర్చారు. అలాగే ఇందులో ఉండే సభ్యులకు అందించే ఆహారం విషయంలో కూడా డీఆర్‌డీఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
సక్సెస్ అయితే ఐదు దేశాల సరసన భారత్
మత్స్య-6000ను సముద్రంలోకి పంపేందుకు వీలుగా ‘సాగర్‌నిధి’ అనే ప్రత్యేక నౌకను డీఆర్‌డీఓ సిద్ధం చేసింది.ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే సముద్రం అడుగు భాగాన అన్వేషించగల సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల సరసన భారత్ నిలవగలదు.
ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ సుమారు రూ.4,077 కోట్లు ఖర్చు చేస్తోంది. డీప్ సీ రంగానికి చెందిన కంపెనీలు ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే డీప్ సీ రంగానికి చెందిన పరిశ్రమలు పెద్ద మొత్తంలో పుట్టుకొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.