ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీ20 కప్
అమెరత్: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భాగంగా నేడు భారత్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ గెలుపుతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని రెండు జట్లు కూడా ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాయి. తిలక్ వర్మ జట్టును నడిపించనున్నాడు. ఐపీఎల్ ఇరగదీసిన కుర్రాళ్లకు ఈ టోర్నీలో అవకాశం దక్కింది. సన్ రైజర్స్ తరఫున అదరగొట్టిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాడు. ఆయుష్ బదోని, రమణ్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి కుర్రాళ్లు ఉన్నారు.