calender_icon.png 17 January, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూ విజయనాదం

17-01-2025 12:14:45 AM

ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీ

క్వార్టర్స్‌లో తెలుగు తేజం

కిరణ్, సాత్విక్ జోడీ ముందంజ

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజం, భారత షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పెళ్లి తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న సింధూ దూకుడైన ఆటతీరుతో సింహంలా గర్జిస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సింధూతో పాటు పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌చిరాగ్ జోడీ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధూ 21 21 మనామి సుజు (జపాన్)ను వరుస గేముల్లో చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సుజుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 11 లీడ్‌లో నిలిచింది. ఈ సమయంలో సుజు 11 13 పోటీలోకి వచ్చినట్లు అనిపించింది.

దీంతో ఫుంజుకున్న సింధూ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ ఆది నుంచి సింధూ తడాఖాను చూపిస్తూ వచ్చింది. రెండో గేమ్‌లో సగం టైమ్ పూర్తయ్యే సమయానికి 11 స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సింధూ దెబ్బకు తోక ముడిచిన సుజు ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో సింధూ పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మారిస్కా తున్‌జంగ్ (జార్జియా)ను ఎదుర్కోనుంది. 

కిరణ్ జోరు..

పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి కూడా క్వార్టర్స్‌లో అడుగపెట్టాడు.  ప్రీక్వార్టర్స్‌లో కిరణ్ 22 21 అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్)పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌లో కిరణ్‌కు గట్టిపోటీ ఇచ్చిన అలెక్స్ రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇక క్వార్టర్స్‌లో కిరణ్ చైనాకు చెందిన హాంగ్ యాంగ్‌ను ఎదుర్కోనున్నాడు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ శెట్టి ద్వయం కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో సాత్విక్ ద్వయం 20 21 21 ఒకామురా (జపాన్) జంటపై విజయాన్ని అందుకుంది. మహిళల డబుల్స్‌లో అశ్విని జోడీ ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. ఈ జంట 9 21 మత్సుమొటో (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది.