న్యూఢిల్లీ: గత నాలుగైదు రోజులుగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను అలరించిన ఇండియా ఓపెన్ సూపర్ టోర్నీ ముగిసింది. ఈ పోటీల్లో భారత్ ఒక్క విభాగంలో కూడా విజేతగా నిలవలేకపోయింది. భారత్ నుంచి స్టార్ క్రీడాకారులు పాల్గొన్నా కానీ వారిని విజయం వరించలేదు. దీంతో టోర్నీ ముగింపుకు ముందే భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది.
ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్, మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన అన్ సేభూ పురుషుల డబుల్స్‌లో మలేషియా క్రీడాకారులు, మహిళల డబుల్స్‌లో జపాన్ వనితలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో చైనా ప్లేయర్స్ స్వర్ణ పతకాలు సాధించారు.
అట్టహాసంగా వేడుకలు: ముంబైలోని వాంఖడే స్టేడియం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ క్రికెటర్లతో పాటు హిట్ మ్యాన్ శర్మ కూడా హాజరయ్యారు.