calender_icon.png 14 January, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఇండియా ఓపెన్

14-01-2025 12:02:23 AM

  • బరిలో పీవీ సింధు
  • ఫేవరెట్‌గా సాత్విక్ జోడీ

న్యూఢిల్లీ: మలేషియా ఓపెన్‌లో నిరాశపరిచిన భారత షట్లర్లు స్వదేశంలో నేటి నుంచి జరగనున్న ఇండియా ఓపెన్ సూపర్ టోర్నీ ఆడనున్నారు. మలేషియా ఓపెన్ సెమీస్‌లో ఓడిన సాత్విక్‌హూ శెట్టి ద్వ యం టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుం ది. ఇక భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు పెళ్లి తర్వాత తొలి టోర్నీ ఆడనుంది. సింగిల్స్‌లో సింధూతో పాటు లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, మాళవిక బన్సోద్ తదితరులు పాల్గొననున్నారు.

ప్రపంచ నం బర్‌వన్ షి యూకీతో పాటు ఒలింపిక్ చాం పియన్ విక్టర్ అలెక్సన్, యాన్ సె యంగ్ కూడా పోటీలో ఉన్నారు. భారత్ నుంచి పు రుషుల సింగిల్స్‌లో ముగ్గురు, మహిళల సిం గిల్స్‌లో నలుగురు, పురుషుల డబుల్స్‌లో రెండు జోడీలు, మహిళల డబుల్స్‌లో ఎనిమిది జోడీలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో నాలుగు జోడీలు ఉన్నాయి.

టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరైన సింధూ మాట్లాడుతూ.. ‘ప్రస్తు తం బెంగళూరులో నా కొత్త కోచ్ ఇర్వాన్స్ యా దగ్గర ట్రెయినింగ్ తీసుకుంటున్నా. మ హిళల సింగిల్స్ కోచ్‌గా పనిచేసిన అనుభవమున్న అతను నాకు మంచి సలహాలు అం దిస్తున్నాడు. కెరీర్‌లో ఇది లాస్ట్ ఫేజ్ అనుకుంటున్నా. ఈ దశలో స్పీడ్‌తో పాటు పవర్‌ను పెంచుకోవాలనుకుంటున్నా. ట్రోఫీ సాధిస్తానన్న నమ్మకముంది’ అని పేర్కొంది. విజేతగా నిలిచిన ఆటగాళ్లకు 9లక్షల 50వేల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.