calender_icon.png 25 October, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యల భారతం

12-07-2024 02:23:32 AM

బలవన్మరణాల్లో భారత్ టాప్

చిన్న విషయాలకే సూసైడ్లు

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 11: మన జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా కానీ బలవంతంగా ఉసురు తీసుకునేవారు వినట్లేదు. సిల్లీ సమస్యలకే విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాల్లో తీరని దుఃఖం మిగులుస్తున్నారు. ప్రపంచంలో సూసైడ్ చేసుకునే వారిలో ఇండియా టాప్ పొజిషన్‌లో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. సినిమాలు, మేధావులు, మీడియా ఎన్ని రకాలుగా ‘ఆత్మహత్య అనేది నేరం’ అని ప్రచారం చేసినా వినిపించుకోవట్లేదు.  2022లో భారత్‌లో ఏకంగా 1.71 లక్షల మంది సూసైడ్ చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతి లక్ష మందిలో 12.4 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. 

సిల్లీ రీజన్స్.. 

ఆత్మహత్య చేసుకునే వారికి కొంపలు మునిగిపోయే సమస్యలు ఉంటాయా? అంటే చాలా కేసుల్లో అవి కనిపించడం లేదు. ఇంట్లో భార్య చట్నీలో ఉప్పు తక్కువగా వేసిందనో, నాన్న మొబైల్ రీచార్జి చేయించలేదనో, ప్రియురాలు మాట్లాడడం లేదనో ఇలా సిల్లీ రీజన్స్ చెప్పి ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవాళ్లకు కడుపుకోతను మిగులుస్తున్నారు. మానసిక అనారో గ్యం కూడా సూసైడ్ కేసులు పెరిగేందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. 

ఒత్తిడి నార్మల్ కాదు..

ఒత్తిడి అనేది నార్మల్ థింగ్ అని అంతా అనుకుంటారు. కానీ లైట్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి నెమ్మదిగా పెద్ద సమస్యగా మారి.. తర్వాత యాంగ్జుటై, డిప్రెషన్‌గా రూపాంతరం చెందుతుందట. వ్యక్తి ఆత్మహత్యకు ఇది పరోక్షంగా కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే వారిలో 50 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారే ఉన్నారు.  

సూసైడ్ కనిపించేంత చిన్నదేం కాదు.. 

సూసైడ్ మనకు కనిపించేంత చిన్న సమస్య మాత్రం కాదు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో సూసైడ్ ఒకటి. ఎక్కువగా యువకులు సూసైడ్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత, ఆర్థిక, మానసిక సమస్యలతో బాధపడే అనేక మంది వ్యక్తులు ఆత్మహత్యకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సూసైడ్ ట్రెండ్ విపరీ తంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూత్‌లో ఈ ట్రెండ్ వ్యాప్తి ఆందోళనకరం. 

ఇలా చేస్తే సరి.. 

సూసైడ్ ఆలోచనలు వచ్చినపుడు మానసిక వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఒంటరిగా ఉండకుండా వీలైనంత ఎక్కువ సేపు నలుగురితో గడిపేందుకు ప్రయత్నించాలి. ఆత్మహత్యకు కావాల్సిన ధైర్యంలో 10 శాతం ధైర్యం ఉన్నా బతికి నిరూపించొచ్చు. 

చివరగా.. 

ఒక విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని సూసైడ్ చేసుకున్నాడని అనుకుందాం. కానీ ఆత్మహత్యతో అతడు పరీక్షల్లో పాస్ కాడు. అంతేకాకుండా అతన్ని పిరికివాడుగా ఈ సమాజం చూస్తుంది. ఆత్మహత్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాబోదు.

అదే ప్రధాన కారణం 

ఈ సూసైడ్స్ గురించి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ సైక్యాట్రీ అండ్ బిహేవియరల్ సైన్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ.. చాలా కేసుల్లో డిప్రెషన్ (కుంగుబాటు) ఈ సూసైడ్స్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోందని వెల్లడించారు. ఆర్థిక సమస్యలు, పని విష యంలో సమస్యలు వంటి అనేక విషయాల్లో కూడా ఒత్తిడి సూసైడ్స్‌కు కార ణం అని వైద్యులు పేర్కొంటున్నారు.