‘స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ’ తాజా నివేదిక ప్రకారం భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో మూడో అత్యంత కాలుష్య దేశంగా నమోదు కావడం విచారకరం. దీన్నిబట్టి మన రహదారుల దుస్థితి అర్థమవుతున్నది. టాప్ యాభై నగరాలలో 42 మన దేశంలోనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఢిల్లీ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించడం రాజధాని ప్రజల దురదృష్టం. ఈ ఎన్నికల వేళ మన ప్రధాని ఎంతసేపు రాజకీయాల గురించి మాట్లాడకుండా దేశవ్యాప్తంగా వాయు కాలుష్య నివారణకు తీసుకున్న, తీసుకోబోయే చర్యలేమిటో ప్రజలకు చెబితే బావుంటుంది. నగరాలు, మహానగరాల జీవితం పేరుకే అట్టహాసం కానీ, బయటకు వెళ్లాలంటేనే భయం.
సహర్ష్, ఓల్డ్ అల్వాల్, సికిందరాబాద్