calender_icon.png 20 January, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచానికి భారత్ ఆశాకిరణం

22-10-2024 02:53:16 AM

ఎన్డీటీవీ సమ్మిట్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత్ యావత్ ప్రపంచానికి ఆశాకిరణంలా కనిపిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం ‘ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని దేశాలు కరోనా, ఆర్థిక సంక్షోభం, యుద్ధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మన దేశం మాత్రం ‘భారత్ శతాబ్ది’ గురించి ఆలోచించిందన్నారు.

దేశంలోని ప్రతిరంగం అభివృద్ధివైపు దూసుకుపోతు ందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చి 125 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలను ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. మూడోసారి అధికారం చేపట్టాక రూ.9లక్షల కోట్లతో ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించనట్టు చెప్పారు.

కొత్తగా నిర్మించిన 3 కోట్ల పక్కా గృహాలను అర్హులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకూ 15 వందే భారత్ రైళ్లను ప్రారంభించామన్నారు.